విమానం నుంచి దింపి మరీ… కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసిన అసోం పోలీసులు

ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో కాసేపు హైడ్రామా కొనసాగింది. ఛత్తీస్ గఢ్ లోని పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బయల్దేరగా.. విమానాశ్రంయలో అసోం పోలీసులకు అడ్డుకున్నారు. ఆయన్ను విమానం నుంచి కిందికి దింపేసి, అరెస్ట్ కూడా చేశారు. అయితే…. టేకాఫ్ కి కొద్ది నిమిషాల ముందు లగేజీ విషయంలో ఏదో సమస్య వుందని, విమానం దిగాలని సిబ్బంది సూచించారు. ఆ సమయంలోనే ఆయన వెంట వున్న సీనియర్లు అడ్డుకునే యత్నం కూడా చేశారు. ఈ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు విమానం టేకాఫ్ కాకుండా అడ్డుకుంటూ.. నిరసనకు దిగారు. బోర్డింగ్ పాస్ వున్నా… అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

 

మరో వైపు ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే పవన్ ఖేరాను ఆపేశారని కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ కావాలే కాంగ్రెస్ నేతలపై బల ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. ఏఐసీసీ ప్లీనరీకి వెళ్లకుండా, అడ్డుకునేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఖేరాను అడ్డుకోవడం సిగ్గు చేటని, పార్టీ అండగా నిలుస్తుందని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అవమానించారని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు ఖేరాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందుకే తాము అరెస్ట్ చేస్తున్నట్లు అసోం పోలీసులు పేర్కొన్నారు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ… పీవీ, అటల్ హయాంలో జేపీసీని ఏర్పాటు చేశారని, ప్రధాని నరేంద్ర గౌతమ్ దాస్… సారీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఏ సమస్య వచ్చిందంటూ ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates