జిహాద్ భావన భగవద్గీతలో ఉందట… వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివరాజ్ పాటిల్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ భగవద్గీత విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిహాద్ భావన కేవలం ఖురాన్ లోనే కాదు.. భగవద్గీతలోనూ వుందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ జీవిత గాథ పుస్తకం విడుదల సందర్భంగా శివరాజ్ పై వ్యాఖ్యలు చేశారు. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్ పై పాఠాలు చెప్పాడని పేర్కొన్నారు. ఇస్లాంలో జిహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎవరైనా సరైన ఆలోచనను అర్థం చేసుకోకపోతేనే బల ప్రయోగం చేయాలి. ఇది ఖురాన్ తో పాటు గీతలోనూ వుంది అంటూ శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates