ప్రధాని మోదీ ‘నడక’పై కాంగ్రెస్ విమర్శలు… ఈసీ చూడటం లేదని మండిపాటు

గుజరాత్ లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది దూరం నడుచుకుంటూ పోలింగ్ స్టేషన్ కి వచ్చారు. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పోలింగ్ వేళ ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని, రోడ్ షో చేపట్టారని కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా వుందని కాంగ్రెస్ విమర్శించింది. రెండు గంటల పాటు ప్రధాని రోడ్ షోలాగా చేశారని, దీన్ని ఛానళ్లు కూడా కవర్ చేశాయన్నారు.

 

దీనిని బట్టి చూస్తే గుజరాత్ లో అందరూ ఒక్కటయ్యారని అనిపిస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ప్రధాని రోడ్ షో పై ఈసీ మౌనంగా వుందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ నేడు అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాన్వాయ్ ను కొంత దూరంలోనే నిలిపేసి, నడుచుకుంటూ వెళ్లి, సాధారణ వ్యక్తిలా లైన్లో నిల్చున్నారు. తన వంతు వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే… కాన్వాయ్ ఆపి.. నడుస్తూ.. దారి పొడవునా అభివాదం చేశారు.

Related Posts

Latest News Updates