కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ క్రమశిక్షణా సంఘం 6 సంవత్సరాల పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే… మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఢిల్లీలో భేటీ కావడం, ఆ తర్వాత పార్టీపై ఘాటైన విమర్శలు చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుసుకున్నారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందంటూ ఈ భేటీ తర్వాత వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల తర్వాత ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు క్రమశిక్షణా సంఘం ప్రకటించింది.