పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం సుప్రీం తీర్పును స్వాగతించారు. నోట్ల రద్దుపై సుప్రీం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, అయినప్పటికీ… ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా? ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా? అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరమన్నారు. అయితే… సమయంలో నోట్ల రద్దు చట్ట విరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అని విమర్శించారు.
ఇక… కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయ ప్రక్రియతో ముడిపడిన పరిమిత విషయాలు మాత్రమే సుప్రీంకోర్ట్ తీర్పులో ఎక్కువగా ఉన్నాయని, నిర్ణయ ఫలితాలు ఇందులో లేవని జైరామ్ రమేష్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాలు నెరవేరాయా లేదా అనే విషయాలను ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. డిమానిటైజేషన్‌పై తీర్పులో సుప్రీం జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.












