అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా నుంచి తన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఈ వస్తువులను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలించారు. మొత్తం 2 డీసీఎంలలో తరలించారు. ఇకపై రాహుల్ గాంధీ తల్లి సోనియాతోనే కలిసి వుండనున్నారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రెటేరియట్ రద్దు చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 22 లోపు అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది.

Related Posts

Latest News Updates