కాంగ్రెస్ ఎన్నికల నామినేషన్ తేదీ ముగుస్తున్న కొద్దీ ఉత్కంఠత మరింత పెరిగిపోతోంది. అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నానని నిన్న రాత్రి వరకూ ప్రకటించిన దిగ్విజయ్ సింగ్ ఒక్క పూటలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. మల్లి కార్జున ఖర్గే పోటీలో వుంటున్నందు వల్లే తాను బరి నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.
మరోవైపు గాంధీ, నెహ్రూ కుటుంబం లేకపోతే పార్టీయే లేదని దిగ్విజయ్ అన్నారు. కాంగ్రెస్ లో సంక్షోభాలు సహజమేనని, అయినా… గాంధీ కుటుంబం వైపే కార్యకర్తలు నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆ పరివారమే కాంగ్రెస్ కు బలమని, వారు లేకపోతే పార్టీ శూన్యమన్నారు. అయితే.. రాజస్థాన్ లో ఏర్పడిన ప్రతిష్టంభన అంత శ్రేయస్కరం కాదని దిగ్విజయ్ పేర్కొన్నారు.