తెలంగాణ కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్ అవుతోంది. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అతి త్వరలో బీజేపీలో చేరనున్నారు. మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే.. రెండు రోజుల క్రిందటే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి విమానంలో బయల్దేరినట్లు వార్తలొచ్చాయి. అయితే… తాను తను మనుమడి స్కూల్ ఫంక్షన్ కోసమే వెళ్తున్నానని, బీజేపీలో చేరడం లేదని అన్నారు. కానీ… ఈ ప్రకటన వచ్చిన ఓ రోజు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం గమనార్హం.