అమెరికాలో కలకలం.. 30 మంది చిన్నారులకు

అమెరికాను మంకీపాక్స్‌ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్‌ బారినపడినట్లు ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడిరచాయి.  వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం ఆమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాలోని చిన్నారులు మంకీపాక్స్‌ బారినపడినట్లు తెలుస్తోంది. ఒక్క టెక్సాస్‌లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు పేర్కోంది. అమెరికాలో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291  న్యూయార్క్‌లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్‌ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్