రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకొన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దాదాపు 3 లక్షల మంది పాక్షిక బలగాలను సేకరిస్తామని ఆయన చేసిన ప్రకటనపై రష్యన్లలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలోని పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళనలకు దిగారు. ఆందోళనల అణచివేతకు పుతిన్ పోలీసులను రంగంలోకి దించి 750 మందిని అరెస్టు చేశారు. రాజధాని మాస్కోలో 370 మంది, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు.