‘కమిటీ కుర్రోళ్లు’ ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మేమంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. వంశీ గారు కథను నెరేట్ చేసినప్పుడు పదకొండు మంది జీవితాల్నిచూసినట్టుగా అనిపించింది. మ్యూజిక్‌తో పాటుగా కథను నెరేట్ చేశారు. అప్పుడే మాకు విజువల్‌గా సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది. నాకు కథతో పాటు ఆయన నెరేట్ చేసిన విధానం నచ్చింది. ఎన్నో ఎమోషన్స్‌ అందరికీ టచ్ అవుతుంటాయి. ప్రతీ ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా ఎమోషన్స్‌తో వెళ్లాడు. ఊర్లో ఉండే ప్రతీ ఒక సంఘటన ఇందులో ఉంటుంది. ఊర్లో గొడవలు, రాజకీయాలు, ఆడే ఆటలు అన్నీ ఉంటాయి. పదకొండు మంది జీవితాలను చూపించబోతోన్నాం. 8 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వాళ్ల వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో చూపించబోతోన్నాం. ఎవరో ఒకరు ఏదో ఒక కారెక్టర్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’ అని అన్నారు.

దర్శకుడు ఎదు వంశీ మాట్లాడుతూ.. ‘ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పక్షులకు ఓ గూటిలా.. నిహారిక గారు మా అందరికీ ఓ చోటు ఇచ్చారు. నా డైరెక్షన్ టీం నాతోనే ఉన్నారు.. ఆరువేల మంది ఆడిషన్స్ తరువాత 11 మందిని సెలెక్ట్ చేస్తే.. వారు కూడా నాతో ఉన్నారు.. ఎన్నో ప్రొడక్షన్ సంస్థల చుట్టూ తిరిగాను. చిన్న బడ్జెట్‌తోనే తీస్తాను అని నిహారిక గారితో చెప్పాను. రమేష్ గారు చేసిన సపోర్ట్‌తోనే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రంతో 11 మంది గొప్ప ఆర్టిస్టులను పరిచయం చేయబోతోన్నాం. వాళ్లు నటించలేదు.. జీవించారు. వాళ్లంతా కూడా జెమ్స్. దీపక్ సరోజ్, అంకిత్ కొయ్య గార్లకు థాంక్స్. మా కథను నమ్మిన ఫణి గారికి థాంక్స్. విజయ్ మాస్టర్ రావడంతో బాగానే భయపడ్డాను. డైరెక్టర్ గారి స్థాయి గురించి పట్టించుకోకుండా అడిగినట్టుగా ఫైట్ కంపోజ్ చేసి ఇచ్చారు. అనుదీప్ గారు ఇచ్చిన ప్రతీ పాట ఓ ఆణిముత్యంలా ఉంటుంది. ఎడిటర్ అన్వర్ అలీ నాకు చాలా క్లోజ్. రైటర్స్ నాతో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ వచ్చారు. జేడీ మాస్టర్ పాటలను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. అందర్నీ ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది. అందరూ చిన్నతనంలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో విజయ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ అద్భుతంగా ఉండబోతోంది. నిహారిక గారు తీసిన వెబ్ సిరీస్ చూశాను. ఆమెకు సినిమా మీద, కంటెంట్ మీదున్న ప్యాషన్ కనిపిస్తుంటుంది. వంశీ ఈ కథను చెప్పినప్పుడే.. పాటలు, మ్యూజిక్ అన్నీ అయ్యాయి. పాటలు అద్భుతంగా ఉండబోతోన్నాయి. నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుందని నాగబాబు గారు అన్నారు. ఆల్రెడీ ఏపీలో సునామీ వచ్చింది. ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సునామీ రాబోతోంది. మేమంతా కూడా డిప్యూటీ సీఎం గారి తాలుకా. ఈ కుర్రాళ్ల జీవితాన్ని తెరపై చూస్తే అందరికీ వారి వారి జీవితాలు గుర్తుకు వస్తాయి. తెలిసిన మొహాలు ఉండకూడదని అందుకే కొత్త వాళ్లని తీసుకున్నాం. నిహారిక గారు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమా సక్సెస్ అవ్వాలి. టీంకు మంచి పేరు రావాలి. ఊర్లో జరిగే ప్రతీ సంఘటన ఈ చిత్రంలో ఉంటుంది. ఊరి మూలాల్లోకి వెళ్లి సినిమా కథను రాసినట్టుగా ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో హనుమాన్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే టైంలో వంశీ కూడా కలిశారు. నన్ను కంపోజర్‌గా ముందు ఆయనే అనుకున్నారు. నేను జీవితంలో వంశీ వల్లే ఫస్ట్ నెరేషన్ విన్నాను. నిహారిక, ఫణి గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు వచ్చింది. అందరూ అద్భుతంగా నటించారు. మ్యూజిక్ పరంగా నిర్మాతలు నాకు ఎంతో సహకరించారు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ.. ‘వంశీ గారు మాకు ముందు ఈ కథను చెప్పినప్పుడు షాక్ అయ్యాం. పదకొండు మంది పాత్రలు, వారి ముప్పై ఏళ్ల జీవితాన్ని చూపించాలని అన్నారు. చిన్న సినిమా అని అన్నారు. గోదావరి ఒడ్డున తీయాలని అన్నారు. నిహారిక గారు స్క్రిప్ట్ విన్నాక చాలా నచ్చింది. నాగబాబు గారు, ఫణి గార్లకు కూడా చాలా నచ్చింది. వంశీని నమ్మి అందరూ నటించేశారు. నటీనటులంతా కూడా వంశీ స్క్రిప్ట్‌ని ఫాలో అయ్యారు. ఇది సినిమాలా కాకుండా.. 11 మంది జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. టెక్నీషియన్లంతా కూడా వంశీతో పాటు మూడేళ్లుగా జర్నీ చేస్తూనే వచ్చారు. అందరూ ఈ ప్రాజెక్ట్‌ను చాలా నమ్మారు. అందరికీ ఈ ప్రాజెక్ట్ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ రాజు మాట్లాడుతూ.. ‘నిహారిక గారితో ఇది నాకు మూడో ప్రాజెక్ట్. ఇంత మంచి స్క్రిప్ట్‌లో నాకు ఛాన్స్ ఇచ్చిన నిహారిక, ఫణి గార్లకు థాంక్స్. అందరికీ ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుంది. టీం సహకారంతో సినిమాను బాగా తీశాను. ఈ మూవీ నుంచి మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్ రాబోతోంది. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

ఎడిటర్ అన్వర్ అలీ మాట్లాడుతూ.. ‘ఇదంతా కూడా కొత్త టీం. మా అందరినీ ప్రోత్సహించిన నిహారికి గారికి థాంక్స్. నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ.. ‘మెగా ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా వస్తోంది. అలాంటి బ్యానర్లో పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిహారిక, ఫణి గార్లకు థాంక్స్. మళ్లీ వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. కరోనా టైంలో వంశీ అన్న ఫోన్ చేసి కథను వినిపించాడు. పద్నాలుగు మంది హీరోలన్నాడు. షాక్ అయ్యాం. ఇది నాలుగేళ్ల ప్రయాణం. ఆరువేలకంటే ఎక్కువ ఆడిషన్స్ చేశాం. తొంభై శాతం మందికి ఇది ఆరంభం. ఆడియెన్స్ మా అందరినీ ఆదరించాల’ని అన్నారు.

రైటర్ వెంకట్ సుభాష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇలాంటి కథ విన్నప్పుడు టైం మిషన్‌లా అనిపించింది. ఆడియెన్స్ అందరినీ వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. మా మెమోరీస్‌ను ఫీల్ అవుతూ రాశాం. ఆడియెన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని భావిస్తున్నాను’ అని అన్నారు.

లిరిసిస్ట్ సింహా మాట్లాడుతూ.. ‘హనుమాన్ చిత్రంలో ఆవకాయ ఆంజనేయ అనే పాటను రాసి ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత కమిటీ కుర్రాళ్లు సినిమాకు పాట రాశాను. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాటలను రాశాను. నాకు ఛాన్స్ ఇచ్చిన అనుదీప్ గారికి, నిహారికి గారికి, ఫణి గారికి థాంక్స్’ అని అన్నారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాను చేయకపోయి ఉంటే చాలా బాధపడేవాడ్ని. మనం ఏం మిస్ అవుతున్నాం.. ఏం వదులుకోవడం లేదు.. దేన్ని పట్టుకుంటున్నాం.. ఎటు వెళ్తున్నాం.. అనే అద్భుతమైన అంశాలతో వంశీ రాసిన కథ నాకు చాలా నచ్చింది. కుర్రోళ్లు అద్భుతంగా నటించారు. మా నిహారిక మంచి కథను తీసుకున్నారు. అందరికీ ఈ చిత్రం రీచ్ అవుతుంది. నాలుగు పాటలు, ఫైట్లు ఉంటేనే సినిమా కాదు.. ఇలాంటి కథలు రావాలి. మంచి పాటలున్నాయి. మంచి విజువల్స్ ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Related Posts

Latest News Updates