ఈ చిత్రానికి ఘన విజయం
చేకూర్చడం “సూపర్ స్టార్”కు
మనమిచ్చే ఘన నివాళి!!
తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసి, సౌజన్యానికి, సాహసానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం”. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్ – సుహాసిని జంటగా నటించగా… నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 16, సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించి, విడుదల తేది ప్రకటించేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు!!
ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ప్రముఖ దర్శకనిర్మాత సునీల్ కుమార్ రెడ్డి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, “హతవిధి” చిత్రంతో హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్న డైనమిక్ లేడి లవ్లీ మధుమిత, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, పద్మాలయ శర్మ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహ నిర్మాత బండ్రి నాగరాజ్ గుప్తా పాల్గొన్నారు. సూపర్ స్టార్ కు ఘన నివాళి అర్పించిన అనంతరం… సినిమాను జనవరి-3న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు!!
“ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ ను అభినందించారు.
దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ… “సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరు చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ పేర్కొన్నారు!!
ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: శ్రీకాంత్, పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, సహ నిర్మాతలు” బండ్రి నాగరాజ్ గుప్తా – బి.వెంకటేష్ శెట్టి – శ్రీపాద హన్ చాటే, కథ -స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాణం – దర్శకత్వం: హెచ్.మధుసూదన్!!