కెనడా దేశంలోని కొలంబియా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తమిళనాడు ప్రాంతానికి చెందిన అంజలి అప్పాదురై పోటీలో నిలవటం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో పుట్టి పెరిగిన అంజలి తన ఆరేళ్ల వయసులో కెనడాకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు. అనూహ్యంగా సీఎం రేసులో కి వచ్చిన ఆమె తీరు ఆసక్తికరంగా మారింది. కొలంబియా రాష్ట్రానికి 2017లో ఎన్నికలు జరగటం. అందులో న్యూ డెమోక్రటిక్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రాధినేతగా జాన్ హోర్గన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే గొంతు క్యాన్సర్ నేపథ్యంలో పార్టీ నాయకత్వం నుంచి రాష్ట్రాధినేత పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవితో పాటు కొలంబియా రాష్ఠ్రాధినేత స్థానానికి ఆమె పోటీ పడుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డేవిడ్ ఏబీ బరిలో ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా బరిలో ఉన్న అంజలి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 13న అంతర్గత ఎన్నికలు ప్రారంభమై, డిసెంబర్ 3న తుది ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం ఆమె కోక్ విల్టమ్ సిటీలో ఉంటున్నారు. రాజకీయ నేతగా, సోషల్ యాక్టివిస్టుగా ఆమెకు మంచి పేరుంది. ఆమె కోరుకుంటున్నట్లుగా కొలంబియా రాష్ట్రాధినేతగా అవతరిస్తారో లేదన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.