అధికారంలోకి వస్తే… వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా : సీఎం నితీశ్

సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లో బీజేపీయేతర ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే… అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా అమలు చేస్తామని, ఇందులో మరోమాటే లేదన్నారు. 2024లో బీజేపీయేతర పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ఇది కేవలం బీహార్ రాష్ట్రం గురించి మాత్రమే కాదు. ప్రత్యేక హోదా పొందాల్సిన ఇతర రాష్ట్రాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను” అని నితీశ్ పేర్కొన్నారు.

 

సీఎం నితీశ్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని, బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. మరోసారి కూడా భేటీ అవుతామని ప్రకటించారు. కొన్ని రోజుల క్రిందటే తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ అంశాలపై చర్చించారు.

Related Posts

Latest News Updates