దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాల… ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

దేశంలోనే తొలి వర్చువల్‌ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థలు ఈ స్కూల్‌లో చేరేందుకు అర్హులేనని ఆయన తెలిపారు. నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్‌ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌-డీఎంవీఎస్‌లో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 9-12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఢిల్లీ మోడల్‌ వర్చువల్ పాఠశాలను దేశ విద్యారంగంలో మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థులు లైవ్ క్లాసులకు హాజరు కావొచ్చని, రికార్డ్ చేసిన తరగతి సెషన్లు, స్టడీ మెటీరియల్ ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఆ విద్యార్థులకు ఐడీ, పాస్ వర్డులు కూడా ఇవ్వనున్నారు. డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో వున్నాయి. పలు కారణాలతో బడికి వెళ్లలేని పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates