తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానునానయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం పేర్కొన్నారు.
బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందన్నారు. దాదాపు రూ.350 కోట్ల ఖర్చుతో కోటి ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటీ చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు.