సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. అంతకుముందు సికిద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.