కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. సినీనటులు కైకాల సత్యనారాయణ చాలా విలక్షణమైనటువంటి నటుడు అని సీఎం అన్నారు హీరోకున్న గ్లామర్ సత్యనారాయణకు ఉందని, ఏ పాత్ర ఇచ్చిన కూడా సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారని అన్నారు.
కైకాల ఎంపీగా పని చేసిన కాలంతో ఆయనతో కొన్ని అనుభావాలు కూడా పంచుకున్నాంమని, కొంతకాలం మేమంతా కలిసి కూడా పని చేశామని గుర్తు చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడిని కోల్పోవడం చాలా బాధాకరమని, సత్యనారాయణ లోటును ఎవరూ కూడా పూడ్చలేరని తెలిపారు. ఆయనకు సమానమైన నటులు కూడా ఇప్పుడు లేరన్నారు. ఆయన పోషించిన పాత్రలు అద్భుతం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.