టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా మారిపోయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నామని, దీనికి అనుమతులు కావాలంటూ దసర రోజున సీఎం కేసీఆర్ ఈసీకి లేఖ పంపారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్పు చెందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి గురువారం రాత్రి ఓ అధికారిక లేఖను పంపింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ కి విచ్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై సీఎం కేసీఆర్ అంగీకారం తెలుపుతూ మధ్యాహ్నం 1:20 నిమిషాలకు సంతకాలు చేశారు.

 

దీంతో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. బీఆర్ఎస్ అమలులోకి వచ్చినట్లైంది. ఇక… తాను సంతకం చేసిన లేఖను సీఎం కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. ఈ వేడుకల్లో కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, నటుడు ప్రకాశ్ రాజ్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ఎదుట సంబరాలు చేసుకున్నారు.