తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు.మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు. ఒకప్పుడు సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగ అయ్యిందని తెలిపారు. వ్యవసాయ ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.దేశ వ్యాప్తంగా వ్యవసాయం పండగ అయినప్పుడే అసలైన సంక్రాంతి అని సీఎం కేసీఆర్ అన్నారు.