రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

 

ఇక…. రోడ్డు, భవనాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పల్లె ప్రాంతాల్లోని రోడ్లపై కూడా కన్నేయాలని, వాటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలన్నారు. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని అన్నారు. అలాగే రోడ్డు, భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై కూడా కేసీఆర్ చర్చించారు.