సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? మునుగోడు ఫలితాల తర్వాత దీనిపై పెద్ద చర్చ జరిగింది. అంతేకాకుండా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం వుంటుందని కేసీఆర్ ప్రకటించగానే… మీడియా మొత్తం ముందస్తు అంటూ కోడై కూసింది. అయితే.. దీనిపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం సాగింది. తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఫలితాలపై చర్చ, రాబోయే ఎన్నికలు, బీజేపీపై పోరాటంపైనే ప్రముఖంగా ఈ సమావేశం జరిగింది.

 

బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని పక్క పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్నది తనకు తెలిసిపోతుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే మంత్రి కేటీఆర్కుగానీ ప్రగతి భవన్కు గానీ వచ్చి చెప్పుకోవాలని చెప్పినట్లు పార్టీ నేతలు అంటున్నారు.

ఇక… ఈడీ దాడులను ఏమాత్రం ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఎక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తే.. అక్కడ ధర్నాలు చేయాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే వుందని, సిట్టింగ్ లకే మళ్లీ టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పథకాలను బాగా ప్రజల్లోకి తీసుకె