తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన సీఎం… ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జూన్ 28 న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ ఏ అంశంపై మాట్లాడుకున్నారో మాత్రం తెలియరాలేదు.