సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఈ నెల 14 న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే పార్టీ జాతీయ కార్యవర్గం, జాతీయ విధానాలను కూడా ప్రకటించనున్నారు. అదేవిధంగా రాజశ్యామల యాగం కూడా చేయనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోశ్, నిరంజన్ రెడ్డి, తదితరులు ముందే ఢిల్లీకి చేరుకున్నారు.
ఇక పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి బయల్దేరనున్నారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుధాకర్ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.