ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తూ.. వెళ్తూ.. మధ్యలో సీఎం కేసీఆర్, ల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ముఖ్యమంత్రులకు వేద పండితులు ఆశీర్వచనాలు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అయితే.. ఖమ్మం సభకి వెళ్తూ…. మధ్యలో యాదగిరి గుట్టకు కేరళ సీఎం పినరయ్ విజయన్, తెలంగాణ వామపక్ష నేతలు కూడా వెళ్లారు. స్వామి వారి దర్శనానికి మాత్రం వెళ్లలేదు. యాదగిరి గుట్టలో స్వామి వారి ఆశీస్సులు అందుకున్న తర్వాత సీఎం కేసీఆర్ తో పాటు నలుగురు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖమ్మం సభకి బయల్దేరనున్నారు. యాదగిరి గుట్టకు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.