శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి చేరుకున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్, స్పీకర్ తదితరులు హకీంపేట్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్ భవన్ లో జరిగే విందు కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే.. గవర్నర్ తమిళిసై ఇచ్చే ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి. ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలడానికి సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళ్లలేదు. ప్రభుత్వం పక్షాన మంత్రి తలసాని వెళ్లి, స్వాగతం పలికిన విషయం తెలిసిందే.