వీఆర్ఏలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం డ్రామాలాడుతున్నారా? అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. దీంతో వీఆర్ఏ నేతలు ఒక్కసారిగా బిత్తర పోయారు. వరంగల్ టూర్ లో వున్న సీఎం కేసీఆర్.. అధికారిక కార్యక్రమాల అనంతరం పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే అక్కడికి తమ సమస్యలపై సీఎం వినపతి పత్రం ఇచ్చేందుకు వీఆర్ఏ సంఘం నేతలు వచ్చారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఇంతకు ముందు వీఆర్ఏలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు నిరసనకు దిగారు. దీంతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.