ఖమ్మం బీఆర్ఎస్ సభ ప్రబల మార్పుకు సంకేతమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభివర్ణించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన భారీ బహిరంగ సభ అని అన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే… దేశ రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని ప్రకటించారు. రెండేళ్లలోనే వెలుగుల జిలుగుల భారత్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక… రైతు బంధును కూడా దేశంలో అమలు చేస్తామన్నారు. కష్టాలు కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు.
సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని ప్రకటించారు.అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదని కేసీఆర్ వాపోయారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.ఒకవేళ కేంద్రం ఎల్ఐసీ, విశాఖ ఉక్కును అమ్మినా తాము అధికారంలోకి రాగానే వాపస్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.