తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం సీఎం జగన్ తలకి అర్చకులు పరివట్టం కట్టారు. దీని తర్వాత సీఎం జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం నఇది నాలుగో సారి. శ్రీవారి దర్శనం తర్వాత సీఎం జగన్ కు వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీని తర్వాత 2023 డైరీ, క్యాలెండర్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సీఎం జగన్ ఇంతకంటే ముందు తిరుపతి గ్రామ దేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్య గుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్ కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. మరోవైపు సీఎం జగన్ అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎలక్ట్రిక్ బస్సులను జెం డా ఊపి ప్రారంభించారు.