విశాఖ పట్నం వేదికగా పెట్టుబడులే లక్ష్యంగా జరగబోయే ”గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” లోగోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వచ్చే యేడాది మార్చి 2,3,4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ విశాఖలో నిర్వహిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. పెట్టుబడుల కోసం గ్లోబలన్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తామని తెలిపారు.

కరోనా కారణంగా ఈ సమ్మిట్ ను నిర్వహించలేకపోయామని, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ ను చేస్తున్నామని అన్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారని అన్నారు. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నామని, విశాఖ, కాకినాడ పోర్టులను డెవలప్ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. దేశానికి ఏపీనే గేట్ వేగా మారబోతోందని ప్రకటించారు.












