తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు.మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లిషు విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను. అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates