మాండూస్ తుపాను, భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంత క్లిష్టమైన సమయంలో జిల్లా కలెక్టర్లు మానవతా ద్రుక్పథంతో వ్యవహరించాలని సూచించారు.నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలన్నారు. వచ్చే వారం లోగా ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. ఇక.. మాండూస్ తుపాను ప్రభావంతో ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు 2వేలు, రేషన్ అందించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఇక… రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించ వద్దని సీఎం స్పష్టం చేశారు. తుపాను కారణంగా నష్టపోయి, తిరిగి పంట వేయాలనుకున్న రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని సూచించారు. పట్టణాలు, పల్లెలు అన్న సంబంధం లేకుండా సహాయాన్ని బాధితులందరికీ అందించాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే.. వారికి కూడా పరిహారం సత్వరమే అందేలా చూడాలని జగన్ ఆదేశించారు.












