ఎన్టీఆర్ అంటే వల్లమాలిన ప్రేమ… ఎప్పుడూ గౌరవిస్తా : సీఎం జగన్

ఎన్టీఆర్ అంటే తనకెంతో గౌరవం, అభిమానం వున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన్ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలో ఎవ్వరూ వుండరన్నారు. ఆయనంటే తనకెలాంటీ కోపమూ లేదని, చంద్రబాబు కంటే తానే ఎక్కువగా గౌరవిస్తానని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ప్రభుత్వం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఏనాడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని, ఎప్పటికీ ఆయన్ను గౌరవిస్తూనే వుంటానని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చామని గుర్తు చేశారు.

 

నందమూరి తారకరామారావు అనే పేరు పలికితే చంద్రబాబుకు నచ్చదని…. చంద్రబాబు పలికితే ఎన్టీఆర్‌కు నచ్చదని తెలిపారు. ఎన్టీఆర్ గొప్పనటుడని, గొప్పఖ్యాతి సంపాదించారని కొనియాడారు. చంద్రబాబు అధికారం లాక్కోకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతికేవారని అన్నారు. 1995లో సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అధికారం లాక్కోవడంతో మానసిక క్షోభ వల్ల ఎన్టీఆర్ అకాల మరణం చెందారన్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి మాట నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఉంటే బావుండేది.. ఎందుకు పేరు మార్చుతున్నాం… దానికి కారణం ఏంటి అది సహేతుకమా కాదా అనేది చర్చించాల్సింది అని సీఎం అన్నారు.

Related Posts

Latest News Updates