ఏపీలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోందన్న పుకార్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు అన్న రూమర్స్ ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కార్యకర్తలు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే సీఎం జగన్ ముందస్తు పై కామెంట్స్ చేశారు.
అలాగే మంత్రుల మార్పు కూడా వుండదన్నారు. దీంతో మంత్రులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ముందస్తు, మంత్రుల మార్పు అన్న అంశాలు మున్ముందు మరింత వైరల్ అవుతాయని, వాటిని ఎక్కడికక్కడే ఖండించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి లబ్దిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని, ఆగస్టు నాటికి గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేయాలని జగన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు.