నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారవ్వాలి : సీఎం జగన్

ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని సీఎం ఆకాంక్షించారు. ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండొద్దని, ఆ లక్ష్యంతోనే అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్సైజ్, ఎస్ ఈబీ అధికారులతో పోలీసు శాఖ మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. అదే విధంగా దిశ యాప్ వినియోగం, కాల్స్, స్పందించడం వంటి వాటిపై మాక్ డ్రిల్స్ విస్తారంగా చేయాలని సూచించారు.

ఇకపై వారంలో రెండు సార్లు మాదక ద్రవ్యాల నియంత్రణపై సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కాలేజీలు, యూనివర్శిటీలు, పాఠశాలల వద్ద నార్కొటిక్స్ నియంత్రణపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా అరికట్టాలన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మారాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలన్నారు.

 

Related Posts

Latest News Updates