ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇంచార్జిలు హాజరుకానున్నారు. వీరితో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇంత సడెన్ గా ఎందుకు మీటింగ్ ఫిక్స్ చేశారు.. ఏప్రిల్ 3వ తేదిన ఎమ్మెల్యేలు, కోర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు, రిజనల్ కోర్డినేటర్లు అందరూ తప్పక హాజరుకావాలని సీఎం చెప్పడంతో.. ఆయన ఏదో చెప్పబోతున్నారన భావిస్తున్నారు.
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఎవరిపైనా వేటు వేసే విషయం చెబుతారా.. లేక ఎన్నికలకు సమయం ఎక్కవ లేకపోవడంతో.. సీట్లు ఎవరికి ఇవ్వడం లేదన్నదానిపై క్లారిటీ ఇస్తారా? ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రలోభాల పర్వంపై ఆరోపణలు ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏం చెబుతారు అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇక, ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికలు ఎప్పుడుంటాయి.. టికెట్లు ఎవరికి ఇస్తారు అన్నదానిపైనా అధినేత క్లారిటీ ఇస్తారని సమాచారం..