కల్లుగీత నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కల్లుగీత కార్మికుల విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వారికిచ్చే పరిహారాన్ని రెండింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో ఐదేళ్ల పాటు కొనసాగే కల్లుగీత నూతన విధానాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల కూడా చేసింది. కల్లుగీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబానికి ప్రస్తుతం 5 లక్షలు మాత్రమే నష్టపరిహారం అందుతోంది. కొత్త విధానంతో వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందుతుంది. ఈ నూతన విధానం ద్వారా 95 వేల 245 కల్లు గీత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ప్రభుత్వం పేర్కొంది.

 

 

ఇక.. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేట్లు చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక… కల్లు రెంటల్స్ ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సొసైటీలు, గీతచేవానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం 5 సంవత్సరాల వరకు అనుమతి ఇస్తారు. కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించనున్నారు. వైఎస్సార్ బీమా ద్వారా నష్ట పరిహారం ఇస్తారు.

Related Posts

Latest News Updates