ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి బయల్దేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం, విభజన హామీలతో పాటు పలు అంశాలపై సీఎం ప్రధానితో చర్చించనున్నారు. కొన్ని రోజుల క్రిందటే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జీ 20 సమావేశంలో పాల్గొన్నారు.
