క్రిస్మస్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ జరుపుకున్నారు. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 3 రోజుల పాటు సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మకు సీఎం జగన్ కేక్ తినిపించారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వివరించారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసు మార్గనిర్దేశం చేశారన్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులు క్రిస్మస్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కుటుంబీకులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు చేశారు.