సంక్రాంతి పండుగను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. గోశాల వద్ద సంక్రాంతి వేడుకల సెట్ నిర్మించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు గోశాలలో గోపూజ చేశారు. ముందుగా జ్యోతిని వెలిగించి, సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. ఆపై గోపూజ, భోగి మంటలను వెలిగించారు. హరిదాసు కీర్తనలు ఆలకించి, హరిదాసుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు జరిగాయి. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసి తీరును అద్భుతంగా వుంది. ప్రముఖ సంక్రాంతి వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి తిలకించారు.

సీఎం జగన్ పావురాలను ఎగుర వేశారు. ప్రముఖ నృత్య కళాకారుడు ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శించారు. సింగర్ హారిక నారాయణ్, జానపద గాయని కనకవ్వ కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్ జోష్ పాటలతో కార్యక్రమాలు నిర్వహించారు.












