వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలవలేనన్న భయం, నిరాశ చంద్రబాబులో కనిపిస్తోందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అంటూ ప్రజల్ని భయపెడుతున్నారని జగన్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పంలో టీడీపీని చిత్తుగా ఓడించారని, అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మారా బాబూ అని తలపట్టుకున్నారని విమర్శించారు.
టీడీపీ బూతుల పార్టీ అని, జనసేన రౌడీసేన అని జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత పాలనతో విసుగుచెందే వారిని ఓడించి, ప్రజలు బైబై చెప్పారని అన్నారు. తన పాలనలో కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు మంచి చేయలేదని, ఆయన, దత్తపుత్రుడు కలిసి ఇది చేశామని చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు అని, రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.












