చదువుతోనే కుటుంబాల రాత మారుతుంది… పేదరికం పోతుంది : సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు జూలై- సెప్టెంబర్ త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుటుంబాల తల రాత మారాలన్నా… పేదరికం దూరం కావాలన్నా.. చదువే మార్గమని వివరించారు. పేదరికం అనేది అభ్యాసానికి అవరోధం కావొద్దనే వైఎస్సార్ ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చామన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి, అధికారంలోకి రాగానే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని జగన్ అన్నారు.

 

మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని సీఎం జగన్ విమర్శించారు. అధికారంలో వున్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను దగా చేసి, నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలో వున్నప్పుడు ఏమీ చేయకుండా… ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా తాము భావించమని, ఆస్తిగా భావిస్తున్నామని వివరించారు.

Related Posts

Latest News Updates