‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. నాటు నాటు ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుందని అభినందించారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును దక్కించుకున్న RRR సినిమా టీమ్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఆస్కార్ అనేది ఇప్పటి వరకూ భారత్ కి ఓ కలగానే వుండేదని, కానీ… రాజమౌళి విజన్, ధైర్యం, నమ్మకం అవార్డును తెచ్చిపెట్టాయని ప్రశంసలు కురిపించారు. ”కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1635113500875051009?s=20
కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్రక్షిత్, ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళిల పేర్లను ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. అలాగే ఆస్కార్ అవార్డుల్లో భారత్ బోణీ కొట్టింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంపై కూడా హర్షం వ్యక్తం చేస్తూ… టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.
https://twitter.com/KChiruTweets/status/1635125199669694470?s=20













