సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన కేవలం తెలుగు సినిమా రంగానికి మాత్రమే కాదని, భారత సినీ రంగానికి కూడా గర్వకారణమే అన్నారు. ఆయన పోషించిన పాత్రలు బహుశ: దేశంలో వేరొక నటుడు పోషించి వుండరన్నారు. కైకాలతో కలసి, తాను ఎన్నో చిత్రాల్లో నటించానని, ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూశానన్నారు. గొప్ప స్పాంటేనియస్ లక్షణమున్న నటులని, స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి అని అన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1606137673785249792?s=20&t=pq-wpSlGmcQ54VvfDaXkLQ
తనను తమ్ముడూ అంటూ తోడబుట్టిన వాడిలా ఆదరించారని, తమ మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయన్నారు. ఈ యేడాది కైకాల జన్మదినం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి, శుభాకాంక్షలు తెలిపానని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాని, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నానని చిరంజీవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.












