మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ . మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో మెగాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ‘ఆచార్య’ ఎఫెక్ట్ తో ఎలా ఉంటుందోనని ముందుగా అందరూ భావించారు. కానీ.. మెగా ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతోంది. రెండు రోజుల్లో..సినిమా కలెక్షన్స్ పరంగా స్పీడు చూపించింది. వరల్డ్ వైడ్‌గా గాడ్ ఫాదర్ ఫస్ట్ డే రూ. 17.68 కోట్లు షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. రెండో రోజున రూ.9.67 కోట్లు సాధించింది.
నైజాం – రూ. 5.67 కోట్లు
సీడెడ్ – రూ.5.14 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.27 కోట్లు
ఈస్ట్ – రూ. 2.11 కోట్లు
వెస్ట్ – రూ 1.04 కోట్లు
గుంటూరు – రూ. 2.35 కోట్లు
కృష్ణా – రూ. 1.22 లక్షలు
నెల్లూరు – రూ. 90 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ సినిమా రూ. 20.70 కోట్లు షేర్ వసూళ్లను రాబట్టింది. దీన్ని గ్రాస్ వసూళ్ల ప్రకారం చూస్తే రూ. 34.75 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కర్ణాటక – రూ. 2.30 లక్షలు హిందీ, రెస్టాఫ్ ఇండియా – రూ. 1.80 లక్షలు ఓవర్ సీస్ – రూ. 2.55 కోట్లు వచ్చాయి. అంటే వరల్డ్ వైడ్‌గా చూస్తే గాడ్ ఫాదర్ చిత్రం రూ. 27.35 కోట్లు షేర్ వసూళ్లను తెచ్చుకుంది. గ్రాస్ ప్రకారం చూస్తే రూ. 50.35 కోట్లు అని ట్రేడ్ సర్కిల్స్ సమాచారం. అయితే.. చిత్ర యూనిట్ చెబుతున్న వివరాల మేరకు గాడ్ ఫాదర్ సినిమాకు రెండో రోజున రూ. 31 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అంటే మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ. 69 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు.