నా తమ్ముడి నిజాయితీ, నిబద్దత నాకు తెలుసు!… రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలే ఇస్తారు!!. మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. జనసేనకు మద్దతు ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పవన్ కే తన మద్దతు ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లాంటి నాయకుడు మనకు కావాలని, తన తమ్ముడి నిబద్దత తనకు చిన్పప్పటి నుంచి తెలుసని వ్యాఖ్యనించారు. పవన్ కు రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన ఆకాంక్ష కూాడా అదేనంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే జై కొట్టారు. పవన్‌కే తన పూర్తి మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానేమోనని అన్నాడు. పవన్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని చిరంజీవి అభిప్రాయపడ్డాడు. తన తమ్ముడి నిజాయితీ, నిబద్దత తనకు తెలుసు అని చిరంజీవి తెలిపాడు. తామిద్దరం రాజకీయంగా చెరోవైపు ఉండటం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్ కు హెల్ప్ అవుతుందేమోనని చిరు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇవ్వొచ్చని, అలాంటి రోజు రావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చిరు తెలిపారు.గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు జనసేనకు మద్దతు ప్రకటించని చిరు.. ఇప్పుడు మీడియా సమావేశంలో పవన్ కే మద్దతు ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Related Posts

Latest News Updates