వేషమే బౌద్ధ సన్యాసి… చేసేది చైనాకి గూఢచర్యం… అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

బౌద్ధ సన్యాసిలా భారత్ లో నివసిస్తూ.. చైనాకు గూఢచర్యం చేస్తున్న చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డోల్మా లామాగా పేరు మార్చుకొని, బౌద్ధ సన్యాసిగా వుంటూ… ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ లో వుంటోంది. ఈమె అసలు పేరు కాయ్ రో. కానీ… పురుష బౌద్ధ సన్యాసిలా వుంటూ… చైనాకు గూఢచర్యం చేస్తోందని ఆమె రికార్డులు పరిశీలించగా… పోలీసులకు తెలిసింది. కాయ్ రో పేరుతో చైనా పాస్ పోర్టు వాడి… 2019 లో భారత్ లోకి వచ్చింది. 3 సంవత్సరాల నుంచి భారత్ లో నే వుంటోంది. విచారణ సమయంలో తనను చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని వెల్లడించినట్లు తెలిపారు. ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts

Latest News Updates