అరుణాచల్ ప్రదేశ్ వేదికగా రెండు రోజుల పాటు జీ 20 సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి జీ 20 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అయితే… ఈ కీలక సమావేశానికి చైనా డుమ్మా కొట్టింది. చైనా నుంచి ఏ అధికారి కూడా ఈ కీలక సమావేశానికి హాజరు కాలేదని అరుణాచల్ ప్రదేశ్ అధికారులు పేర్కొన్నారు.అయితే… ఎందుకు డుమ్మా కొట్టారో కూడా ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు ఈ సమావేశం అత్యంత రహస్యంగానే జరిగింది. మీడియాను కూడా అధికారులు రానివ్వలేదు. సమావేశం ముగిసిన తర్వాత… అరుణాచల్ ప్రదేశ్ అధికారులే ఓ ఫొటోను విడుదల చేశారు. మరోవైపు ఈ జీ 20 అధికారులు ఇటానగర్ లో వున్న బౌద్ధ క్షేత్రాన్ని కూడా సందర్శించారు. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనీషియేటివ్ గేదరింగ్ అనే థీమ్ తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశం నిర్వహించింది.