ఛత్తీస్ గఢ్ లో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు… మండిపడ్డ ముఖ్యమంత్రి భాగేల్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు ఛత్తీస్‌ఘడ్ లో సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఛత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణం నేపథ్యంలోనే ఈడీ ఈ దాడులకు దిగింది. ఈడీ దాడులు చేసిన వారందరూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహితులని సమాచారం. కోల్ లెవీ స్కాంలో కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.

 

అయితే… ఈ దాడులపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ స్పందించారు. భారత్ జోడో యాత్ర విజయవంతమై అదానీకి సంబంధించిన నిజానిజాలు బట్టబయలు కావటంతో బీజేపీ నిరుత్సాహానికి గురైందని విమర్శించారు. అందుకే ఈడీ రైడ్ తో దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ట్వీట్ చేశారు. దేశానికి నిజం తెలుసు. పోరాడి గెలుస్తామని ప్రకటించారు. గత ఏడాది అక్టోబరులో ఈడీ జరిపిన దాడుల్లో రూ.4కోట్ల నగదు, ముఖ్యమైన కీలక పత్రాలు దొరికాయి.

 

ఛత్తీస్​గఢ్​లో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్​ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు కొద్ది రోజుల ముందు ఈడీ రైడ్స్​ జరగడం ప్రధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఈడీ దాడులను ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ భఘేల్​ ఖండించారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

 

ఛత్తీస్​గఢ్​లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం బొగ్గు కుంభకోణంలో మనీలాండరింగ్​కు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఛత్తీస్​గఢ్​లో ప్రతి టన్ను బొగ్గు రవాణాకు రూ. 25 పన్ను తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పలువురు ఆరోపించారు. ప్రభుత్వం చర్యలతో అనేక మంది సీనియర్​ దౌత్యాధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతలు, మధ్యవర్తులు అక్రమంగా, భారీగా లబ్ధిపొందినట్టు ఈడీ చెబుతోంది.

 

Related Posts

Latest News Updates