మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ విడిచిపెట్టారు. మొదటి ఎన్ క్లోజర్ నుంచి రెండు చిడతలను, ఆ తర్వాత రెండో ఎన్ క్లోజర్ నుంచి మరో చిరుతను విడిచిపెట్టారు. తన 72 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. సుమారు 74 సంవత్సరాల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్ లోకి వచ్చాయి. మొత్తం 8 చీతాలను ప్రత్యేక ప్లేన్ లో భారత్ కు తీసుకొచ్చారు.
ఫెడోరా టోపీ ధరించి… స్వయంగా ఫొటోలు తీసిన మోదీ
ఫెడోరా టోపీ ధరించిన మోదీ ఒకటవ, రెండవ ఎన్‌క్లోజర్లలోని చిరుత పులులను విడుదల చేశారు. అవి కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌లోకి వెళ్తుండగా ప్రొఫెషనల్ కెమెరాతో ఫొటోలు తీశారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులు మన అతిథులని, కునో-పాల్పుర్ నేషనల్ పార్క్ వాటి ఇల్లు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వీటిని తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.
Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV
— ANI (@ANI) September 17, 2022
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రాజకీయ ప్రాధాన్యం ఉన్నట్లు ఎవరూ భావించరని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తాము నిరంతరం కృషి చేసి, ఈ చిరుతలను తీసుకొచ్చామన్నారు. విస్తృతమైన చీతా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసి, అమలు చేశామని మోదీ వెల్లడించారు.